జమ్మూలో 30 మంది సైనికుల ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన హవల్దార్ వరికుంట్ల సుబ్బయ్య (45) అంతిమ యాత్ర అనంతపురం జిల్లా నార్పలలో గురువారం ప్రారంభమైంది. ఆర్మీ, పోలీసు అధికారులు, స్థానిక ప్రజల అశ్రునయనాలతో అంతిమయాత్ర సాగుతోంది. జాతీయ జెండాలు చేతబట్టి సుబ్బయ్య అమర్రిహే అంటూ ప్రజలు నివాళులు అర్పిస్తున్నారు. కాసేపట్లో అంత్యక్రియలను అధికారిక లాంచనాలతో నిర్వహించనున్నారు.