హెల్త్ సెక్రటరీలకు ఇతర బాధ్యతలు వద్దు
సచివాలయాల హెల్త్ సెక్రెటరీలకు ఆరోగ్య శాఖకు సంబంధం లేని ఇతర పనులు అప్పగించవద్దని రాయదుర్గం మున్సిపల్ కమిషనర్ కు ఏపీ ఎన్జీవో అధ్యక్షులు కెంచెలక్ష్మీనారాయణ కోరారు. శనివారం మహిళా కన్వీనర్ శాంత కుమారితో పాటు వార్డు సచివాలయ ఆరోగ్య కార్యకర్తలు కలిసి రాయదుర్గం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ కు విజ్ఞాపన పత్రం అందజేశారు.