తెలుగు రాష్ట్రాల్లో పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి సంచలనం సృష్టిస్తోంది. అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని సెంటినరీ బాప్టిస్ట్ చర్చిలో సందర్శకుల అభిమానుల సందర్శనార్థం ఉంచారు. పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో ప్రవీణ్ పగడాల అంత్యక్రియలు ముగిశాయి. కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా క్రైస్తవులు తరలివచ్చారు.