డీ. హిరేహల్: విద్యుత్ షాక్ కు గురై బాలుడు మృతి

62చూసినవారు
డీ. హిరేహల్: విద్యుత్ షాక్ కు గురై బాలుడు మృతి
విద్యుత్ షాక్ కు గురై బాలుడు మృతిచెందిన ఘటన డి. హిరేహల్ మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. డి. హిరేహల్ కు చెందిన ఎర్రిస్వామి అనే బాలుడు గొర్రెలు మేపడానికి ఇంటి నుంచి వెళ్లారు. అయితే విద్యుత్ ట్రాన్స్ ఫారం వద్ద స్టే వైరు తగిలి విద్యుత్ షాక్ కు గురయ్యారు. వెంటనే బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్