ముత్యాల పూసల అలంకరణలో జంబుకేశ్వరుడు దర్శనం

56చూసినవారు
రాయదుర్గం పట్టణం కోటలో వెలసిన స్వయంభు జంబుకేశ్వరుడు సోమవారం భక్తులకు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. స్వామివారికి పంచామృత, కుంకుమార్చన, రుద్రకవచ అభిషేకాలు చేపట్టి స్వామి పూల విరాట్ పై ముత్యాల పూసలతో అలంకరించి మంగళ నైవేద్యాలు అందించారు. స్వామి వారి విశేష అలంకరణను దర్శించుటకు ఆలయానికి భక్తులు పోటెత్తారు. శివనామస్మరణతో పరిసర ప్రాంతాలు మారుమోగాయి.

సంబంధిత పోస్ట్