ఈశ్వరీయ విశ్వవిద్యాలయంలో ఘనంగా యోగా వేడుకలు

1574చూసినవారు
రాయదుర్గం పట్టణంలోని ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో ప్రపంచ యోగా దినోత్సవం వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ప్రజాపిత బ్రహ్మకుమారి యోగేశ్వరి మాత ఆధ్వర్యంలో యోగ వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేశారు. యోగా గురూజీ కెంచె మల్లికార్జున ఆధ్వర్యంలో యోగా తరగతులు ప్రారంభించారు. నిత్యజీవితంలో యోగాను ప్రతిరోజుసాధన చేస్తే రోగాలు దరిచేరవని తెలిపారు. 30వ తేదీ వరకు యోగాతరగతులు ఉంటాయన్నారు.

సంబంధిత పోస్ట్