రాయదుర్గం: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరికి తీవ్ర గాయాలు

72చూసినవారు
రాయదుర్గం: ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో ఒకరికి తీవ్ర గాయాలు
బొమ్మనహాల్ మండలం రంగాపురం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడడంతో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం చోటు చేసుకుంది. కొనగనహళ్ళి గ్రామానికి చెందిన లక్ష్మికి ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవడంతో ఉద్దేహళ్ లో డాక్టర్ వద్దకు ఆటోలో తీసుకెళ్తుండగా రంగాపురం వద్ద ఆటో అదుపు తప్పి బోల్తాపడడంతో లక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన లక్ష్మిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్