విజయవాడ వరద బాధితులకు వృద్ధాప్య పింఛన్ దారులు జమ చేసిన డబ్బులను సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి సీఎం చంద్రబాబుకు అందజేశారు. ఆమె స్వగ్రామమైన కొండాపురంలోని ఎన్టీఆర్ భరోసా వృద్ధాప్య పింఛన్ లబ్ధిదారులంతా కలిసి జమ చేసిన రూ. 50వేల చెక్కును శనివారం ఆమె సీఎంకు అందజేశారు.