గ్రామాల్లో దోమల నివారణకు పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలని అనంతపురం జిల్లా మలేరియా అధికారి శుక్రవారం ఓబులు కోరారు. బుక్కరాయ సముద్రం మండలం గోవిందంపల్లిలో జరిగిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలో ఇంటింటికీ వెళ్లి దోమల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. పరిసరాలు పరిశుభ్రత పాటిస్తే అంటు వ్యాధులు దూరం అవుతాయని వెల్లడించారు.