గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించాలి

82చూసినవారు
గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించాలి
పుట్లూరు మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో సిసి రోడ్లు, సైడ్ కాల్వలను నిర్మించాలని కోరుతూ బిజెపి శింగనమల అసెంబ్లీ కో కన్వీనర్ కుందు శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో బిజెపి నాయకులు శనివారం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీకి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రాల్లోని మోడల్ స్కూల్, బాలికల ఉన్నత పాఠశాలలకు ఆట స్థలం లేదన్నారు. అదేవిధంగా రోడ్డు వసతి లేదన్నారు. నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులు చాలా దెబ్బతిన్నాయని వాటిని తిరిగి నిర్మించాలన్నారు.

సంబంధిత పోస్ట్