నార్పల మండల పరిషత్ కార్యాలయంలో ఈనెల 21న మండల పరిషత్ అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో గంగావతి తెలిపారు. సమావేశంలో గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై చర్చించనున్నామని పేర్కొన్నారు. సమావేశానికి జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచులు, మండల అధికారులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.