మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే

82చూసినవారు
మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే
బుక్కరాయసముద్రం మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలను అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఆదివారం ఆసుపత్రికి వచ్చారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం ప్రమాదం ఎలా జరిగిందో పోలీసులను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే వెంట అవుకు హరి, శోభ, నాగరాజు, రాయల్ మురళి ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్