యాడికిలో ఘనంగా ఉరుసు మహోత్సవం

70చూసినవారు
యాడికిలో ఘనంగా ఉరుసు మహోత్సవం
యాడికి మండల కేంద్రంలో శనివారం హజ్రత్ సయ్యద్ ముస్తఫా షా ఖాద్రి రహమతుల్లా స్వామి వారి ఉరుసు మహోత్సవం భక్తుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 20వతేదీన స్వామివారి జెండా ప్రతిష్ఠ కార్యక్రమం, 21న హుసేని ఆలం మకాణం నుండి రాత్రి గంధం ఫకీరుల జల్సాలతో దర్గా చేరి స్వామివారికి వంశీయులు ఆధ్వర్యంలో నిర్వహించారు. 22వతేదీన ఉరుసు దీపారాధనలు రాత్రి 7 గంటలకు ఘనంగా నిర్వహించారు.

సంబంధిత పోస్ట్