తాడిపత్రి పట్టణంలో అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ మంగళవారం పర్యటించారు. పట్టణ పరిధిలోని సంజీవనగర్ లో ఉన్న డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. డీఎస్పీ రామకృష్ణుడు తన సిబ్బందితో కలిసి గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. తాడిపత్రి సబ్ డివిజన్ లోని పరిస్థితులపై డీఎస్పీ రామకృష్ణుడిని అడిగి తెలుసుకున్నారు.