కస్తూరిభా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ కవిత

68చూసినవారు
కస్తూరిభా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపీడీఓ కవిత
పెద్దపప్పూరు మండలంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను మండల అభివృద్ధి అధికారి కవిత శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ కవిత పాఠశాలలోని పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం స్టోర్ రూమ్, వంట చేసే విధానం, ఏమైనా సమస్యలు ఉన్నాయని విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా నాణ్యతతో కూడిన భోజనం అందించాలని స్పెషల్ ఆఫీసర్ భావనకు సూచించారు.

సంబంధిత పోస్ట్