నేటి నుంచి విత్తన వేరుశనగకు రిజిస్ట్రేషన్

74చూసినవారు
నేటి నుంచి విత్తన వేరుశనగకు రిజిస్ట్రేషన్
తాడిపత్రి మండలంలోని ఆయా గ్రామాల్లోఉన్న ఆర్బీకేల్లో విత్తన వేరుశనగ కోసం శనివారం నుంచి రిజిస్ట్రేషన్ పక్రియ చేపట్టామని ఏఓ మహి తాకిరణ్ శుక్రవారం తెలిపారు. ప్రభుత్వం 40 శాతం రాయితీతో రైతులకు వేరుశనగ విత్తనకాయలు అందజేస్తుందన్నారు. రాయితీ పోను రైతులు 30 కేజీల బ్యాగుకు రూ. 1, 710 చెల్లించాలన్నారు. అర ఎకరా ఉన్న రైతుకు ఒక బ్యాగు, ఎకరా వున్న రైతుకు రెండు బ్యాగులు, ఎకరా పైగా ఉన్న రైతులకు 3 బ్యాగుల వేరుశనగ అందజేస్తామన్నారు.

సంబంధిత పోస్ట్