తాడిపత్రి మండలంలో సంక్రాంతి సంబరాలు వాడవాడలా అంబరాన్ని తాకుతున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఇళ్ళ ముందర పెద్ద ఎత్తున మహిళలు రంగువల్లులు వేసి మంగళవారం సంక్రాంతికి స్వాగతం పలికారు. రంగువల్లులు వేసి గొబ్బెమ్మలు పెట్టి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అర్ధరాత్రి వరకు మహిళలు రంగువల్లులు వేస్తూ సందడిగా కనిపించారు.