తాడిపత్రి పట్టణ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని, వాటికి అనుగుణంగా తాడిపత్రిలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే రెండురోజుల్లో వాయుగుండం వల్ల భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర పరిస్థితులలో ప్రజలు 9849907425, 08558-222229 నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.