టీడీపీ నేత, మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి డ్రైవింగ్ తో గురువారం రాత్రి అలరించారు. తాడిపత్రిలో జీప్ ను సెల్ఫ్ డ్రైవ్ చేస్తూ చక్కర్లు కొట్టారు. వయసు 70 ఏళ్లు పైబడినా యువతకు ఏ మాత్రం తీసిపోకుండా కాన్ఫిడెంట్ గా డ్రైవ్ చేశారు. తన నివాసం నుంచి అశోక్ పిల్లర్ సర్కిల్ మీదుగా శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం వరకు వాహనం నడిపారు. పట్టణ ప్రజలు జేసీ డ్రైవింగ్ ను చూసి ఆశ్చర్యంగా తిలకించారు.