తాడిపత్రి: భవనానికి మరమ్మతులు చేసి సిబ్బందికి అప్పగించాలి

59చూసినవారు
తాడిపత్రి: భవనానికి మరమ్మతులు చేసి సిబ్బందికి అప్పగించాలి
తాడిపత్రి ప్రాంతంలో పశువులకు వైద్యం నిర్వహించడానికి గతంలో నిర్మించిన భవనానికి మరమ్మతులు చేసి సిబ్బందికి అప్పగించాలని తాడిపత్రి పట్టణ సీపీఐ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మంగళవారం పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వం హయాంలో భవనం నిర్మితమైందని, దాదాపు పదేళ్లు అవుతున్నా భవనాన్ని సిబ్బందికి అప్పగించకపోవడంతో వైద్యులు పశువులకు చికిత్సలు నిర్వహించడానికి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. భవనానికి మరమ్మతులు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్