తాడిపత్రిలోని శ్రీనివాసపురం కాలనీలో సోమవారం పట్టపగలే చోరీ జరిగింది. కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి, శశికళ ప్రభుత్వ ఉపాధ్యాయులు. ఇంటికి తాళాలు వేసి విధులకు వెళ్లగా గుర్తు తెలియని దుండగలు వాటిని పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారని తెలిపారు. ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు నగలు చోరీకి గురైనట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నట్లు సీఐ వివరించారు.