సజ్జలదిన్నెలో చోరీ

68చూసినవారు
సజ్జలదిన్నెలో చోరీ
తాడిపత్రి మండలం సజ్జలదిన్నె గ్రామంలో ఉన్న జగనన్న కాలనీలో దొంగలు ఓ ఇంటి తాళం పగల కొట్టి చోరీ చేశారు. ఆ వివరాలను గురువారం రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి వెల్లడించారు. కాలనీకి చెందిన చాంద్ బాషా కూలిపనికి వెళ్లగా మధ్యాహ్నం సమయంలో తాళం దుండగులు పగలకొట్టి ఇంట్లోకి ప్రవేశించారు. బీరువాలో దాచిన రెండు బంగారు నగలను ఎత్తుకెళ్తారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్