తాడిపత్రి మండలంలో ముగ్గురి అరెస్టు

62చూసినవారు
తాడిపత్రి మండలంలో ముగ్గురి అరెస్టు
తాడిపత్రి మండలంలోని ఊరు చింతల గ్రామం వద్ద గత నెల 27న అక్రమంగా ఇసుకను తరలిస్తున్న సూర్యనారాయణరెడ్డి, మల్లికార్జునరెడ్డి, మారుతీలను బుధవారం అరెస్ట్ చేసినట్లు రూరల్ సీఐ శివగంగాధర్ రెడ్డి తెలిపారు. అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. అందులో భాగంగా వీరిని కడప రోడ్డులో అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.

సంబంధిత పోస్ట్