యాడికి మండలంలో రైతు సంఘం నాయకులు మంగళవారం పర్యటించారు. మండల పరిధిలోని ఎన్ కొత్తపల్లి గ్రామంలో రైతులు సాగుచేసిన పప్పుశనగ పంటలను రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు వెంకట్రాముడు, సీపీఐ సూర్యనారాయణ రెడ్డి తదితరులు పరిశీలించారు. అకాల వర్షాలు, తుఫాన్లు వల్ల పప్పుశనగ పంట దిగుబడి లేక త్రీవంగా నష్టపోయారని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.