తాడిపత్రిలో విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టింది. వైసీపీ రాష్ట్ర కార్య దర్శి కొనదుల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యుత్ ఛార్జీల పెంపుని నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. అనంతరం ట్రాన్స్కో కార్యాలయానికి చేరుకుని వినతిపత్రం అందజేశారు. ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం, వాటిని పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోందని మండిపడ్డారు.