కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామంలో శుక్రవారం రోజున స్థానిక వాల్మీకుల ఆధ్వర్యంలో వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠను ఘనంగా నిర్వహించారు. వేద పండితుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, హోమాలు చేశారు. అనంతరం విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మహిళలు జ్యోతులను మోసుకుని ఊరేగింపుగా వెళ్లి వాల్మీకి మహర్షికి సమర్పించారు. ఈ మహోత్సవానికి వివిధ గ్రామాల నుంచి వాల్మీకులు పాల్గొన్నారు.