కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు

85చూసినవారు
కారు బోల్తా.. ముగ్గురికి గాయాలు
కూడేరు మండలం కమ్మూరు సమీపంలోని 42వ జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం రోడ్డు ప్రమాదం జరిగింది. అనంతపురం పట్టణానికి చెందిన ఓ కుటుంబం పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకొని తిరిగి వెళ్తుండగా విద్యుత్ స్థంబానికి కారు ఢీకొని బోల్తా పడింది. ప్రమాదంలో పరమేశ్వరప్ప, చంద్రకళ, హాసిని గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో అనంతపురం తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్