తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు!

80చూసినవారు
తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు!
తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి బుధవారం వరకు బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో కేంద్రీకృతమైన ఆవర్తనం ప్రభావంతో ఉత్తర ఒడిశా తీరం వద్ద వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని.. ఇది సముద్ర మట్టానికి 5.8 కిలో మీట‌ర్ల ఎత్తులో ఏర్పడిందని వాతావరణ కేంద్రం పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్