ఉరవకొండ ఈద్గా మైదానం వద్ద ఉద్రిక్తత

9699చూసినవారు
ఉరవకొండ పట్టణంలోని గురువారం ఈద్గా మైదానం వద్ద ప్రార్థనలకు వచ్చిన కాంగ్రెస్, వైకాపా వర్గీయుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి వాహనం కాంగ్రెస్ అభ్యర్ధి మధుసూదన్ రెడ్డి సోదరుడు నిఖిల్ నాథ్ రెడ్డి వాహనానికి తగిలింది. దీంతో డ్రైవర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న నిఖిల్ నాథ్ రెడ్డి విశ్వేశ్వరరెడ్డి వాహనం వైపుకు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్