డివైడర్ ను ఢీకొన్న లారీ దగ్ధం

2963చూసినవారు
విడపనకల్ మండలం పెంచలపాడు గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున లారీ డివైడర్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీలో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. బళ్లారి నుండి గుంతకల్లు వైపుకు వెళ్తుండగా ఎదురుగా మరో లారీ రావడంతో దాన్ని తప్పించబోయి డివైడర్ ను ఢీకొంది. మంటలు చెలరేగడంతో అప్రమత్తమైన డ్రైవర్, క్లినర్ అందులో నుండి కిందకు దుకారు. ఘటన స్థలానికి చేరుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్