నటి అరెస్టుకు గత సీఎం కార్యాలయంలోనే కుట్రకు పథక రచన చేసినట్లు తేలింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసులో ఈ ముగ్గురు ఐపీఎస్‌లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని, అధికార దుర్వినియోగంతో పాటు తీవ్ర దుష్ప్రవర్తనకు పాల్పడ్డారని డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి సమగ్ర నివేదిక ఇచ్చారు. ఈ మేరకు వారిని సస్పెండ్ చేస్తూ సీఎస్ ఉత్తర్వులిచ్చారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ విడిచి వెళ్లొద్దని ఆదేశించారు.