ఉరవకొండ: గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ - 30 గొర్రెలు మృతి

81చూసినవారు
ఉరవకొండ: గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ - 30 గొర్రెలు మృతి
ఉరవకొండ పట్టణంలోని అనంతపురం-బళ్ళారి 42వ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ గొర్రెల మందపై దూసుకెల్లడంతో దాదాపు 30గొర్రెలు మృతిచెందగా 40గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. కర్ణాటక రాష్ట్రం హగిరి తాలూకాకి చెందిన ఆరుగురు రైతులు గొర్రెలను మేపుకుంటూ అనంతపురం వైపు వచ్చారు. తిరిగి వారి స్వగ్రామం వెళ్తుండగా అనంతపురం నుంచి బళ్లారికి వెళ్తున్న లారీ వెనక నుండి దూసుకెళ్లింది.

సంబంధిత పోస్ట్