లోక్ అదాలత్తో సత్వర న్యాయం

58చూసినవారు
లోక్ అదాలత్తో సత్వర న్యాయం
కక్షిదారులు లోక్ అదాలత్ ద్వారా సత్వరమే న్యాయం పొందవచ్చని ఉరవకొండ జూనియర్ సివిల్ జడ్జి దుర్గాకల్యాణి పేర్కొన్నారు. శనివారం ఉరవకొండ కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ లో భాగంగా మెగా లోక్ అదాలత్ చేపట్టారు. ఇక్కడ రాజీకి వచ్చిన కక్షిదారులను ఆమె విచారించి, 112 కేసులను పరిష్కరించారు. న్యాయవాదులు జయరాజ్, లక్ష్మీనారాయణరెడ్డి, తుకారాం, రామ్మోహన్, ఆదినారాయణరెడ్డి, చిన్న రాయుడు, సురేశ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్