ఉరవకొండ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని బుధవారం ఎస్ఎఫ్ఎ మండల అధ్యక్ష, కార్యదర్శులు నందు, హరూన్ రషీద్ పరిశీలించారు. వారు మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని, మెనూ తప్పకుండా అమలు చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు రాజేశ్, వంశీ, రాజ, తదితర నాయకులు పాల్గొన్నారు.