వజ్రకరూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి, ఎంపీ మల్లికార్జున అధ్యక్షతన అవగాహన సదస్సు బుధవారం నిర్వహించారు. సదస్సులో ఎస్ఐ నాగస్వామి మాదకద్రవ్యాలు, మత్తు పదార్థాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలని సూచించారు. వసతి గృహ సంక్షేమ అధికారి జి. శ్రీనివాసులు కూడా పాల్గొన్నారు.