వైసీపీ సీనియర్ నాయకులు ఓబులప్ప (55) శనివారం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తన స్వగ్రామమైన వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలోని స్వగృహం ఉదయం 7.30 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్సీ శివరాం రెడ్డి తనాయుడు భీంరెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. వైసీపీ పార్టీలో కీలక నాయకుడిగా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారని అన్నారు.