
ఉరవకొండ: పరీక్షలపై అవగాహన
ఉరవకొండ పట్టణంలో ఉన్న స్పందన కోచింగ్ సెంటర్ లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మంగళవారం సాయంత్రం ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఐసా) మండల అధ్యక్షులు ఎర్రి స్వామి పరీక్షలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాత విద్యార్థి ఫెయిల్ అయితే ఆ విద్యార్థి మనస్థాపానికి గురై ఏవైనా అఘాయిత్యాలకు పాల్పడకూడదు అని పేర్కొన్నారు.