జమ్మలమడుగు: నాగలకట్ట వీధిలో ప్రమాదకర స్తంభం మార్పుకు విజ్ఞప్తి

82చూసినవారు
జమ్మలమడుగు: నాగలకట్ట వీధిలో ప్రమాదకర స్తంభం మార్పుకు విజ్ఞప్తి
జమ్మలమడుగు పట్టణంలోని నాగలకట్ట వీధిలో తుప్పు పట్టి ప్రమాదకర స్థితిలో ఉన్న ఇనుప విద్యుత్ స్తంభాన్ని వెంటనే మార్చాలని కోరుతూ సోమవారం బిజెపి మహిళ నాయకురాలు మెరుగు అరుణ కుమారి ఏడిఈ రాజగోపాల్ కు వినతిపత్రం అందించారు. ఆమె మాట్లాడుతూ ప్రజలు, విద్యార్థులు, గృహిణిలు ఇక్కడ ఎక్కువగా తిరుగుతారని ప్రమాదం జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. స్పందించిన ఏడిఈ రాజగోపాల్ కొత్త విద్యుత్ స్తంభం తక్షణమే ఏర్పాటు చేస్తానన్నారు.

సంబంధిత పోస్ట్