బేడ బుడగ జంగం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దూపం రాజు ఆధ్వర్యంలో సంఘనేతలు, తమ కులాన్ని ఎస్సీ వర్గీకరణ రిజర్వేషన్లలో నమోదు చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం అందజేశారు. కలెక్టర్ స్పందిస్తూ తమకు న్యాయం జరిగేలా కృషి చేస్తామని హామినిచ్చారని, సంబంధిత అధికారులకు వినతి పత్రాన్ని ఫార్వర్డ్ చేసినట్లు సదరు నాయకులు తెలిపారు. ఇందులో రవితేజ, వెంకటేష్ విద్యార్థులు తదితరులున్నారు