తెలుగువారికి అత్యంత ప్రీతికరమైన సంక్రాంతి పండుగకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్రాంతి కానుక అందకపోగా కనీసం రేషన్ దుకాణం ద్వారా కంది బేడలు కూడా పంపిణీ చేయలేదని మంగళవారం చెన్నూరు మండల కేంద్రంలో పలువురు అసహనం వ్యక్తం చేశారు. చెన్నూరులోని పడమటి వీధి, వనం వీధి, భవాని నగర్, కొత్త రోడ్డు, గాంధీనగర్, లక్ష్మీ నగర్, రాజుల కాలనీ తదితర ప్రాంతాల్లో సంక్రాంతి పండగకు కంది బేడలు కూడా ఇవ్వలేదని స్థానికులు అంటున్నారు.