కౌలుపేరుతో కొంతమంది ఆలయ భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆ భూములను దేవాదాయ శాఖ అధికారులు పరిశీలన చేసి పరిరక్షించాలని ఆర్డీవో పి. జాన్ ఎర్విన్ సూచించారు. చెన్నూరు మండల రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో భాగంగా గురువారం చెన్నూరు ఒకటో సచివాలయ ఆవరణంలో నిర్వహించిన కార్యక్రమానికి కడప ఆర్డీవో జాన్ ఎర్విన్ హాజరయ్యారు.