చెన్నూరు: స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే

64చూసినవారు
చెన్నూరు: స్త్రీ, పురుషులు ఇద్దరూ సమానమే
సమాజంలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ సమానంగా హక్కులు ఉన్నాయని ఏ ఒక్కరు ఎక్కువ కాదు తక్కువ కాదని చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, ఎంపీడీవో కిరణ్ మోహన్ రావు అన్నారు. బుధవారం చెన్నూరు ఎంపిడిఓ కార్యాలయం ప్రాంగణం నుండి చెన్నూరు బస్ స్టాండ్ వరకు జెండర్ ఆధారిత హింసకు వ్యతిరేకముగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో వెలుగు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్