కమలాపురం: రూ.14 లక్షలతో త్రాగునీటి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే

77చూసినవారు
కమలాపురం: రూ.14 లక్షలతో త్రాగునీటి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే
కమలాపురం నగర పంచాయతీ ప్రజల నీటి కష్టాలను తొలగించడానికి నగర పంచాయతీలోని రాం నగర్ నుండి బీడీ కాలనీ వరకు, రాం నగర్ వీధులలో త్రాగునీటి పైప్ లైన్ పనులను గురువారం ఎమ్మెల్యే కృష్ణ చైతన్య రెడ్డి ప్రారంభించారు. 15 వ ఫైనాన్స్ మొదటి కోటా నిధుల ద్వారా రూ. 14 లక్షల వ్యయంతో తలపెట్టిన పనులకు పూజ నిర్వహించారు. కార్యక్రమంలో నగర పంచాయతీ అధికారులు, తెలుగుదేశం పార్టీ, బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్