స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన అందరి లక్ష్యమని ఏపీ టూరిజం టీడీఈ బాలాజీ తెలిపారు. శనివారం బి. కొత్తకోట మండలంలోని ప్రముఖ పర్యటక కేంద్రం హార్శిలీహిల్స్ లో తహశీల్దార్ అన్సారీ, మునిసిపల్ కమీషనర్ పల్లవి, ఎంపీడీఓ శంకరయ్య, మేనేజర్ రమాదేవి పారిశుద్య కార్మికులతో కలిసి స్వచ్ఛాంద్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు. అవగాహనా ర్యాలీ చేపట్టి పరిసరాల శుభ్రం చేశారు. పరిశుభ్రతపై అందరి చేత ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో పంచాయతీ, మునిసిపల్ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు.