గంగవరం నుండి చాపాడుకి శాశ్వతమైన రోడ్డు ఏర్పాటు చేయాలి

66చూసినవారు
కమలాపురం మండల పరిధిలోని గంగవరం గ్రామం నుంచి మైదుకూరు నియోజకవర్గం చాపాడు గ్రామానికి చేరుకునేందుకు ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గంగవరం వద్ద నదిలో తాత్కాలికంగా రోడ్డు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో, ఇప్పుడు వర్షాలు ఎక్కువ కురవడంతో పెన్నా నది నీటి ప్రవాహం వలన పలుమార్లు తాత్కాలికంగా నిర్మించిన రోడ్డు కొట్టుకుపోయింది. శాశ్వతమైన వంతెన లేదా రోడ్డు నిర్మించాలని ప్రజలు కోరుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్