మైదుకూరులో వైభవంగా బిందెసేవ

63చూసినవారు
శ్రీ మత్కన్యకాన్యకా పరమేశ్వరి దేవి శరన్నవరాత్రి మహోత్సవ ఉత్సవాలలో భాగంగా బుధవారం ఉదయం మైదుకూరు పట్టణంలో వాసవి మాతకు బిందెసేవను ఆర్యవైశ్య నిర్వహకులు చేపట్టారు. ఉదయం నుంచి ఆలయంలో సుప్రభాత సేవ, మూలవిరాట్ కు పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం మైదుకూరు పట్టణంలోని వీధులలో అమ్మవారి బిందెసేవ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కాయా కర్పూరం సమర్పించారు.

సంబంధిత పోస్ట్