మైదుకూరు నియోజకవర్గంలో శ్మశానవాటికల్లో ఆక్రమణలు తొలగించి ఉపాధి హామీ పథకం కింద ప్రహరీ నిర్మించేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ కోరారు. శాసనసభ సమావేశాల సందర్భంగా ఏడోరోజు మంగళవారం ఆయన మాట్లాడుతూ గ్రామాలకు శ్మశానవాటికలకు స్థలాలు ఉన్నా అయిదేళ్ల వైసిపి పాలనలో ఆక్రమణకు గురికావడంతో శవాలను పూడ్చుకోలేని పరిస్థితి ఉందన్నారు. సర్వే చేసి ఆక్రమణ తొలగించి ప్రహరీలను నిర్మించాలని కోరారు.