బాధ్యతలు స్వీకరించిన సర్పంచ్ హబీబ్ బాష

62చూసినవారు
పీలేరు గ్రామపంచాయతీ సర్పంచ్ గా డాక్టర్ షేక్ హబీబ్ బాష శుక్రవారం తిరిగి బాధ్యతలు స్వీకరించారు. 2021 ఏప్రిల్ 01 మొదట ఆయన సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నికై బాధ్యతలు చేపట్టారు. వ్యక్తిగత అవసరాలరీత్యా 2023 అక్టోబర్ 4 నుంచి 2024 ఆగస్టు 15 వరకు సెలవులో ఉన్నారు. దీంతో ఉప సర్పంచ్ షేక్ జీనత్ షఫీ ఇంచార్జ్ సర్పంచ్ గా వ్యవహరించారు. సెలవులోని హబీబ్ బాష మళ్ళీ తన బాధ్యతల్లోకి వచ్చేసారు. బంధు మిత్రులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.

సంబంధిత పోస్ట్