అన్నమయ్య జిల్లా, పీలేరులో ఓఇంట బ్రహ్మ కమలాలు విరబూసి, గుబాళిస్తున్నాయి. స్థానిక ప్రకాశం రోడ్డులో నివాసముంటున్న షామియానా మణి అనే సుబ్రహ్మణ్యం, లక్ష్మీదేవి ఇంట మంగళవారం బ్రహ్మ కమలాలు దర్శనమిచ్చాయి. ఏడాదికి ఒక్కసారి ఆగస్టు మొదట్లో పూస్తాయి. ఇవి సహజంగా హిమాలయ పర్వతశ్రేణులు, ఉత్తర ప్రదేశ్, ఉత్తర బర్మా, టిబెట్, నేపాల్, దక్షిణ చైనాలో మాత్రమే దర్శనమిస్తాయి. బ్రహ్మకమలం ఉత్తరాఖండ్ రాష్ట్రీయ పుష్పంగా గుర్తించబడింది.