సీఎం చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టణంలో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్ల స్థలాన్ని పేదలందరికీ ఇవ్వాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వి. రామయ్య డిమాండ్ చేశారు. బుధవారం ప్రొద్దుటూరు సీపీఐ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ. జగనన్న కాలనీలలో మౌలిక వసతులు కల్పించాలని తెలిపారు. ఈ సమస్యలపై ఈనెల 18న సోమవారం స్థానిక తహశీల్దార్ కార్యాలయం వద్ద సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేయనున్నట్లు పేర్కొన్నారు.